జాతీయ వార్తలు

అది వారి అంతర్గత వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: తాము ఏ కుటుంబంతోనూ వైరాన్ని కోరుకోమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. సమాజ్‌వాది పార్టీలో అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేశ్ మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుపై ఆయన మంగళవారం స్పందించారు. ‘అది వారి అంతర్గత వ్యవహారం. దీనివల్ల ఎంత నష్టం జరగాలో అంతనష్టం జరిగిపోయింది. తరువాత వచ్చే ప్రభుత్వం దాన్ని భర్తీ చేస్తుంది. ఏ కుటుంబంలోనూ వైరం రావటాన్ని మేం కోరుకోం. అలాంటి పరిస్థితి ఎవరికైనా బాధాకరమే’ అని రాజ్‌నాథ్ అన్నారు. యుపి ఎన్నికల్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరున్నారా? అన్న ప్రశ్నకు, తమ పార్టీ సిఎం అభ్యర్థి ఎవరూ లేకుండానే పలుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిందని అన్నారు. రాష్ట్రంలో ఎవరు సమర్థుడైన నాయకుడో ఎవరు కాదో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశంలో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని రాజ్‌నాథ్ అన్నారు.

చిత్రం..కొత్త ఏడాది సందర్భంగా హోం మంత్రి శాఖ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రాజ్‌నాథ్ సింగ్