జాతీయ వార్తలు

15వేల కోట్ల దావూద్ ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: ముంబయి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన 15వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను యుఏఇ ప్రభుత్వం జప్తు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో దావూద్‌కు హోటళ్లతోపాటు అనేక పెద్దకంపెనీల్లో షేర్లు కూడా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దుబాయ్‌లో ఉన్న దావూద్ ఆస్తులను కూడా జప్తు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్ నుంచి అందిన రహస్య సమాచారం ఆధారంగా దావూద్ ఆస్తులపై యుఏఇ ప్రభుత్వం నిఘా పెట్టింది. ఇప్పటివరకు సేకరించిన సమాచారం ఆధారంగానే 15వేల కోట్ల రూపాయల మేర విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ యుఏఇలో పర్యటించిన సందర్భంగా దావూద్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలను అందించినట్లు తెలుస్తోంది. మాఫియా డాన్ ఆస్తులనే కాకుండా, ఆయన సిండికేట్‌లో భాగంగా ఉన్న అందరి ఆస్తులను జప్తు చేయాలని భారత్ కోరింది. ముఖ్యంగా గోల్డెన్ బాక్స్ ఆనే కంపెనీని దావూద్ సోదరుడే స్వయంగా నడుపుతున్నట్లు కూడా భారత్ సమాచారాన్ని అందించింది. దుబాయ్‌తోపాటు మొరాకో, స్పెయిన్, సింగపూర్, థాయ్‌లాండ్, భారత్, పాకిస్తాన్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలోని కంపెనీల్లో కూడా దావూద్‌కు షేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

దావూద్ ఇబ్రహీం (ఫైల్ ఫొటో)