జాతీయ వార్తలు

ఇది కక్షసాధింపే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 3: తమ పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయను అరెస్టు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. పిఎమ్‌ఓ వత్తిడి కారణంగానే ఈ అరెస్టు జరిగిందన్నారు. సుదీప్ అరెస్టును కేంద్రం అనుసరిస్తున్న కక్ష సాధింపుగా అభివర్ణించిన ఆమె దేశ వ్యాప్తంగా మోదీ సర్కార్ చర్యను నిరసిస్తూ నిరసనలు చేపడతామన్నారు. తమ ఎంపీకి బదులు ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను అరెస్టు చేయాలని, రాజకీయ కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దుపై తాము ఉద్యమాలు చేయడమే ఈ అరెస్టుకు కారణమని ఆరోపించిన మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పోరాటం ఆగదన్నారు. తొమ్మిదిన కోల్‌కతాలోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం ఎదుట, తర్వాత ఢిల్లీ, అసోం, ఒడిశా, త్రిపురల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. తాను కూడా ఓ ప్రభుత్వాన్ని నడుపుతున్నానని.. దొంగలు, గూండాలు, దోపిడీదారుల్ని తానూ అరెస్టు చేయగలనని హెచ్చరించారు. కాగా, తృణమూల్ ఆరోపణలను బిజెపి ఖండించింది. వివిధ కేసుల దర్యాప్తు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు పియూష్ గోయల్ స్పష్టం చేశారు.