జాతీయ వార్తలు

‘సైకిల్’ మాకే ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: ఓ వైపు ములాయంతో రాజీ ప్రయత్నాలు కొనసాగుతుండగానే మరోవైపు తనయుడు అఖిలేశ్ వర్గం సమాజ్‌వాదీ పార్టీ గుర్తయిన సైకిల్‌ను తమకే కేటాయించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రస్తుతం సమాజ్‌వాది పార్టీ అఖిలేశ్ నాయకత్వంలోనే నడుస్తోందని, ములాయం నేతృత్వంలో కాదని ఈసీకి తెలియజేసింది. అఖిలేశ్ వర్గానికి చెందిన రాంగోపాల్ యాదవ్, నరేశ్ అగర్వాల్, కిరణ్మయి నంద మంగళవారం ఉదయం ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి వివరాలు తెలిపారు. 90శాతం మంది నాయకులు, కార్యకర్తలు అఖిలేశ్ వెంటే ఉన్నారని, నిజమైన సమాజ్‌వాది పార్టీ తమదేనని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఏ క్షణంలోనైనా ఎన్నికలు ప్రకటించనున్న నేపథ్యంలో సమాజ్‌వాదిలోని రెండు వర్గాలు గుర్తుకోసం ఇసి తలుపులు తట్టాయి. అతి తక్కువగా సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సైకిల్ గుర్తును ఏ ఒక్కరికో కేటాయించే అవకాశం తక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మధ్యేమార్గంగా సైకిల్ గుర్తును ఎవరికీ కేటాయించకుండా ప్రత్యామ్నాయ గుర్తుల్ని కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం.