జాతీయ వార్తలు

చిట్‌ఫండ్ స్కాం కేసులో మరో తృణమూల్ ఎంపీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 3: రోజ్‌వాలీ చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ్‌ను మంగళవారం సిబిఐ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో తృణమూల్ ఎంపీ తపస్ పాల్ అరెస్టయ్యారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు ఎంపీలను అరెస్టు చేయడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజ్‌వాలీ చిట్స్ కుంభకోణం కేసులో ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సిబిఐ కార్యాలయానికి వచ్చారు. నాలుగు గంటల ఇంటరాగేషన్ తరువాత సుదీప్‌ను సిబిఐ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో సిబిఐ ఆయనకు మూడు సార్లు సమన్లు జారీ చేసింది. శుక్రవారం అరెస్టయిన నటుడు, ఎంపీ తపస్ పాల్‌ను ప్రస్తుతం భువనేశ్వర్‌లో సిబిఐ కస్టడీలో ఉన్నారు.
బిజెపి కార్యాలయంపై రాళ్ల దాడి
సుదీప్ బంధోపాధ్యాయను సిబిఐ అరెస్టు చేయడంతో రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. రోజ్‌వాలీ చిట్ కుంభకోణానికి సంబంధించి విచారించేందుకు బంధోపాధ్యాయను సిబిఐ అరెస్టు చేయడంతో కోల్‌కతాలోని బిజెపి ప్రధాన కార్యాలయంపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగి రాళ్ల వర్షం కురిపించారు. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

చిత్రాలు..విచారణ నిమిత్తం మంగళవారం సిబిఐ కార్యాలయానికి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్

*కోల్‌కతాలోని బిజెపి కార్యాలయం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన