జాతీయ వార్తలు

మోదీ పాలనలో శాస్త్ర పరిశోధనకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 3: దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పేదలు, రైతులు, సామాన్యులకు సైతం సాంకేతిక ప్రయోజనాలు అందేందుకు శాస్తవ్రేత్తలు కృషి చేయాలని కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ చేతులు మీదుగా తిరుపతిలోని ఎస్వీయు తారకరామా క్రీడామైదానంలో ప్రారంభమైన 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇక శాస్తవ్రేత్తలు అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ నిర్వహిస్తున్న పరిశోధనలతో సమాజానికి ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా వాతావరణం, విద్యుత్, వ్యవసాయం, ఆహారం తదితర రంగాల్లో ప్రగతి సాధ్యమైందన్నారు. ఇటీవల తమిళనాడు, ఒడిశాల్లో వచ్చిన తుపాన్లను ముందుగా గుర్తించడంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించడంలో శాస్తస్రాంకేతిక పరిజ్ఞానం ఎలా దోహదపడిందో అందరికీ తెలుసన్నారు. పరిశోధనలు చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదని, ఆ ఫలాలు అందరికీ అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పలురకాల ఉపగ్రహాల ప్రయోగంతో 2కోట్ల మంది రైతులకు ఉపయోగపడే అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దేశంలోని యువత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకుని ముందుకుసాగాలన్నారు. దేశప్రజల కలలు ప్రధాని మోదీ పాలనలోనే సాకారం అవుతాయని మంత్రి చెప్పారు. నానో టెక్నాలజీలో 13వ స్థానంలో భారత్ ఉందని అన్నారు. దేశం ముందున్న అనేక సమస్యలను అధిగమించేందుకు శాస్తవ్రేత్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.