జాతీయ వార్తలు

ఎవ్వరినీ వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 5: నగర నడిబొడ్డున మహిళపై లైంగికదాడి కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. విధులు ముగించుని ఇంటికి వస్తున్న మహిళపై తెగబడ్డ నిందితుల్లో ఒకడు ఐఐటి గ్రాడ్యుయేట్. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్ సూద్ గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యప్ప సూత్రధారి. ‘మొత్తం వ్యవహారంపై వీడియో ఫుటేజ్ చూశాకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. సభ్య ప్రపంచం సిగ్గుతో తలదించుకునే సంఘటన ఇది. ఈ నెల 31 అర్థరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరుగురుని అరెస్టు చేశాం’ అని ఆయన స్పష్టం చేశారు. నిందితులంతా బెంగళూరు నగర వాసులేనని ఆయన అన్నారు. ‘అయ్యప్పే సూత్రధారి. బాధితులరాలితో అతడికి అంతకుముందు ఎలాంటి పరిచయం లేదు. స్నేహితులు కూడా కాదు. కొద్దిరోజుల నుంచి ఆమెను అనుసరించేవాడు. కొత్త సంవత్సరం వేడుకల ముసుగులో ఆమెపై లైంగిక అకృత్యానికి పాల్పడ్డాడు’ అని సూద్ చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి ఓ బైక్ స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. అతడితో ఉన్న మరొకడిని గుర్తించామని, త్వరలోనే అరెస్టు చేస్తామని కమిషనర్ వెల్లడించారు. బుధవారం సిసి కెమెరా దృశ్యాలు వెల్లడవడంతో సభ్య సమాజం షాక్‌కు గురైంది. మహిళ విధులు ముగించుకుని వస్తుండగా స్కూటర్‌పై వస్తున్న ఇద్దరు ముష్కరులు రోడ్డు పక్కన ఆగారు. అందులో ఒకడు ఒక్క ఉదుటున బండి దిగి మహిళను పట్టుకున్నాడు. ఆమె తప్పించుకుపారిపోవడానికి ప్రయత్నించగా వాడు స్కూటర్ వద్దకు లాక్కొచ్చి మరీ వికృతంగా ప్రవర్తించాడు. అక్కడకు దగ్గర్లో నిలబడ్డ కొందరు ప్రేక్షకుల్లా చూస్తూనే ఉన్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ రాక్షస క్రీడ ఓ రెసిడెన్షియల్ బిల్టింగ్ వద్ద సిసి కెమెరాలో రికార్డయింది. బాధితురాలు ప్రతిఘటనతో నిందితులు ఇద్దరూ సంఘటనా స్థలం నుంచి పరారయ్యారని కమిషనర్ తెలిపారు.