జాతీయ వార్తలు

వంద మంది అభ్యర్థులతో బిఎస్‌పి తొలి జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 5: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడంలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) తన ప్రత్యర్థుల కన్నా ముందుంది. 403 సీట్లు గల యుపి అసెంబ్లీలో ఆ పార్టీ 20 జిల్లాలకు చెందిన వంద మంది అభ్యర్థులను గురువారం అధికారికంగా ప్రకటించింది. వీరిలో మూడో వంతుకు పైగా మంది ముస్లింలు ఉన్నారు. రాష్ట్ర ఓటర్లలో సుమారు 20 శాతం మంది ముస్లింలు ఉన్నారు. బహుశా, దీనిని దృష్టిలో పెట్టుకొని బిఎస్‌పి అధికారికంగా విడుదల చేసిన వంద మంది జాబితాలో 36 సీట్లలో ముస్లిం అభ్యర్థులను నిలిపింది. మిగతా నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. బిఎస్‌పి మొత్తం 403 నియోజకవర్గాలలోనూ పోటీ చేయడానికి ఇప్పటికే అభ్యర్థులను వడపోసి కొంతమందిని ఎంపిక చేసినట్లు ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఇటీవల విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఈ వడపోసిన జాబితా ప్రకారం దళితులకు 87 టికెట్లు, ముస్లింలకు 97 టికెట్లు, ఒబిసిలకు 106 టికెట్లు ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. 113 టికెట్లను అగ్ర కులాలకు కేటాయించగా, అందులో బ్రాహ్మణులకు 66 సీట్లు, క్షత్రియులకు 36 సీట్లు, కాయస్తాలు, వైశ్యులు, పంజాబీలకు 11 సీట్లు కేటాయిస్తున్నట్టు ఆమె చెప్పారు. చాలా రోజుల క్రితమే తాను అభ్యర్థులను ఎంపిక చేశానని, వాటిలో ఎలాంటి మార్పులు ఉండబోవని మాయావతి ప్రకటించారు. మోదీ ప్రభుత్వం హయాంలో మైనారిటీలు వివక్షకు గురవుతున్నారని మాయావతి ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే అది బిజెపికే ఉపయోగపడుతుందని ఆమె ముస్లింలను ఉద్దేశించి అన్నారు. ముస్లింల ఓట్ల చీలొద్దని ఆమె పిలుపునిచ్చారు. ముస్లింలంతా బిఎస్‌పికి ఓటు వేయాలని కోరారు.