జాతీయ వార్తలు

నా వ్యాఖ్యలను వక్రీకరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 5: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి దేశ ఐటి రాజధాని బెంగళూరు నగరంలో జరిగిన వికృత చేష్టలపై తాను చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాలనుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర గురువారం మాటమార్చారు. మహిళల రక్షణకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని ఆయన అంటూ, ఈ సంఘటనను హైలైట్ చేయడం వెనుక ‘రహస్య అజెండా’ ఉండవచ్చని తాను అనుమానిస్తున్నానని చెప్పారు. కాగా, ఈ సంఘటనపై తాను చేసిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని, మొత్తం ప్రకటనను కాక కొన్ని మాటలనే వక్రీకరించడం తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. అమ్మాయిల పట్ల ఆకతాయిల వికృత చేష్టలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అంతేకాక పాశ్చాత్య సంస్కృతి గురించి కూడా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పరమేశ్వర స్పష్టం చేశారు. ఈ అంశంపై ఒక టీవీ న్యూస్ చానల్‌తో పరమేశ్వర మాట్లాడుతూ యువతరం పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడానికి ప్రయత్నించడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించినట్లు వార్తలు రావడం తెలిసిందే. వేడుకల్లో ఇలాంటివి జరగాలని తాను కోరుకోలేదని, అయితే అలాంటి సంఘటనలు జరుగుతుంటాయని మాత్రమే తాను అన్నట్లు ఆయన చెప్పారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవమని, వారిని వేరే దృష్టితో తాను ఎప్పుడూ చూడలేదని కూడా ఆయన అన్నారు. న్యూఇయర్ వేడుకల్లో జరిగిన ఘటనలపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ లలితా కుమారమంగళం తీవ్రంగా మండిపడుతూ, ఈ సంఘటనలపై పూర్తి నివేదిక పంపించాలని కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే.