జాతీయ వార్తలు

అభ్యర్థుల వ్యయ ఖాతాలోకే ప్రాయోజిత ప్రకటనల ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జనవరి 5: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఎవరైనా ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో అడ్వర్టయిజ్‌మెంట్లు (ప్రాయోజిత ప్రకటనలు) ఇచ్చినా వాటికి అయిన ఖర్చును అభ్యర్థులు చేసిన వ్యయంగానే పరిగణించడం జరుగుతుందని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి ఒకరు గురువారం ఇక్కడ చెప్పారు. అభ్యర్థులకు సంబంధించిన వాయిస్ మెసేజ్‌లు, అవి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా వాటి వ్యయాన్ని కూడా అభ్యర్థుల వ్యయంగానే పరిగణించడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 77 కింద పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థి అయినా రూ.28 లక్షలకు మించకుండా వ్యయం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు మొదలగునవి ఏవి ముద్రించినా వాటిపై ప్రింటర్, పబ్లిషర్ల పేర్లు, చిరునామాలను ముద్రించాలని ఆయన ప్రింటింగ్ ప్రెస్‌ల యాజమాన్యాలను ఆదేశించారు. ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు ప్రింటింగ్ ప్రెస్ లైసెన్స్‌ను రద్దు చేయడంసహా ఏదైనా చర్య తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించడానికి ఎన్నికల సంఘం సమాధాన్, సువిధ, సుగం పేరిట మూడు ఐటి అప్లికేషన్లను ప్రారంభించిందని ఆయన తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఈ యాప్‌లను ఉపయోగించుకొని ఫిర్యాదులు చేయవచ్చునని ఆయన వివరించారు. ఎన్నికల ప్రక్రియ అమలులో ఉండగా ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఎవరైనా నగదు లేదా ఇతర బహుమతులు ఇచ్చినా, ప్రలోభానికి గురయి తీసుకున్నా సదరు వ్యక్తులపై భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని సెక్షన్ 171సి కింద ఏడాది వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.