జాతీయ వార్తలు

మైనర్ భార్యతో సెక్స్ అత్యాచారమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5:ఒక వ్యక్తి 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు గల తన భార్యతో సంభోగంలో పాల్గొంటే ఆ చర్యను లైంగిక దాడుల నుంచి బాలల పరిరక్షణ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెనె్సస్- పోక్సో) చట్టం కింద లైంగిక దాడిగా పరిగణిస్తారా? అని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భారత శిక్షాస్మృతి (ఐపిసి)లో ఈ విషయమై అస్పష్టత ఉన్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఈ ప్రశ్న అడిగింది. ఒక వ్యక్తి 15 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల తన భార్యతో సంభోగంలో పాల్గొన్నా, లైంగిక చర్యకు పాల్పడినా అది అత్యాచారం (రేప్) కాదని ఐపిసిలోని సెక్షన్ 375 పేర్కొంటోంది. అయితే 18 సంవత్సరాల లోపు వయసు గల బాలికతో సంభోగంలో పాల్గొన్న వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లేనని, అతను శిక్షార్హుడని పోక్సో చట్టంలోని సెక్షన్ 5(ఎన్) పేర్కొంటోంది. ఈ రెండు చట్టాల్లోని వైరుధ్యాన్ని కళ్లకు కడుతూ నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి తన స్వచ్ఛంద సంస్థ ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ (బిబిఎ) తరపున దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల పిటిషన్ (పిల్)ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి ఈ ప్రశ్న సంధించింది. బిబిఎ లేవనెత్తిన ఈ అంశాన్ని పరిశీలించి నాలుగు నెలలలోగా సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశంపై సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఆదేశించింది. వివాహితా, అవివాహితా అనే అంశంతో సంబంధం లేకుండా 18 సంవత్సరాల లోపు వయసు గల బాలికలతో జరిపే సంభోగాన్ని పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద అత్యాచారం (రేప్)గా పరిగణించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు భువన్ రిబు, జగ్జీత్ సింగ్ చబ్ర సుప్రీంకోర్టును అభ్యర్థించారు.