జాతీయ వార్తలు

విమానం కోసం గాలింపు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, జనవరి 6: గల్లంతైన ఎంహెచ్ 370 విమానం కోసం గాలింపుచర్యలు నిలిపివేస్తున్నారు. మరో రెండువారాల్లో గాలింపును ఆపేస్తున్నట్టు మలేసియా రవాణా మంత్రి శుక్రవారం వెల్లడించారు. బాధిత కుటుంబాలు మాత్రం గాలింపుచర్యలు కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఎంహెచ్ 370 విమానం 2014 మార్చి 8న గల్లంతైంది. గాలింపుఆపరేషన్ నిలిపివేయాలని నిర్ణయించినట్టు రవాణా మంత్రి లియో టియోంగ్ తెలిపారు. మిస్సైన విమానం ఆచూకీ కనుగొంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. త్రిసభ్య కమిటీ సమావేశం తరువాత తుది నివేదిక అందజేస్తామన్న మంత్రి సమావేశం ఎప్పుడు జరిగేది స్పష్టం చేయలేదు. 120,000 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణంలో ఎంహెచ్ 370 విమానం కోసం గాలింపుచర్యలు జరిగాయని తెలిపారు. ఇంతకు ముందు మలేసియా అధికారులు ఓ ప్రకటన చేస్తూ ఈ ఏడాది చివరి వరకూ గాలింపుఉంటుందని చెప్పారు. చివరిగా గాలింపునౌక దక్షిణ హిందూ మహాసముద్రంలో గాలింపుచేపట్టింది. ఎంహెచ్ 370 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ గల్లంతైంది. సిబ్బందితో కలుపుకొని విమానంలో 239 మంది ప్రయాణికులున్నారు. మలేసియా విమానయాన సంస్థకు చెందిన ఎంహెచ్ 370 హిందూమహా సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావించారు. అయితే ఎంత గాలించినా ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఒక్క ఆధారమూ దొరకలేదు. ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బ్యూరో(ఎటిఎస్‌బి) విమాన గాలింపులో కీలక పాత్ర పోషించింది.