జాతీయ వార్తలు

ఆలయ సంప్రదాయాలకు భంగం కలుగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జనవరి 6: కేరళలోని శబరిమలలో గల అయ్యప్ప దేవాలయంలోకి సంప్రదాయాలకు, ఆచారాలకు విరుద్ధంగా ఎవరినీ అనుమతించబోమని ఆ ఆలయాన్ని నిర్వహిస్తున్న ట్రావన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (టిడిబి) స్పష్టం చేసింది. పది నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల ఆడవారిని ఈ ఆలయంలోకి అనుమతించరు. అయితే మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ వంద మంది మహిళా కార్యకర్తలతో కలిసి ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్న నేపథ్యంలో బోర్డు ఈ విషయం చెప్పింది. టిడిబి చైర్మన్ ప్రయర్ గోపాలకృష్ణన్ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పది నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల ఆడవారిని ఆలయంలోకి అనుమతించడం ద్వారా సంప్రదాయాలకు, ఆచారాలకు భంగం కలుగనివ్వబోమని అన్నారు. తృప్తి దేశాయ్ వంద మంది మహిళలతో కలిసి ఆలయంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఆయన వద్ద ప్రస్తావించగా, ఆలయ సంప్రదాయాలకు, ఆచారాలకు భంగం కలిగించడానికి ఎవరినీ అనుమతించబోమని బదులిచ్చారు. తృప్తి దేశాయ్‌ని అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించనివ్వబోమని దేవస్వోమ్ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ చేసిన ప్రకటనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని గోపాలకృష్ణన్ అన్నారు.