జాతీయ వార్తలు

పట్టాలు తప్పిన గూడ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, జనవరి 6: తెలంగాణ, మహారాష్ట్ర సరిహాద్దుల్లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో హైదరాబాద్-కాజీపేట మార్గాల్లో పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిన దారి మళ్లించి నడిపారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ సంఘటన జరిగింది. దక్షిణ మధ్య రైల్వే పరిథిలోకి వచ్చే చంద్రపూర్ జిల్లా వీర్‌గాం స్టేషన్ సమీపంలో 150- 3 వద్ద కాగజ్‌నగర్ వైపు నుంచి బలర్షావైపునకు బొగ్గు లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పగా 16 బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిలో ఉన్న బొగ్గు నేలకొరిగింది. పట్టాలు కనిపించకుండా బొగ్గుతో నిండిపోయాయి. కాగ వీర్‌గాం సమీపంలోని ఘటన స్థలానికి చేరే ట్రాక్‌పై ముందుభాగంలో రైలు పట్టా ఒక చోట తెగినట్లు అధికారులు గుర్తించారు. కాగా ఈ ప్రమాదంతో బలార్షా, కాగజ్‌నగర్ మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న దక్షిణ మధ్య, సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు ప్రత్యేక రైళ్లలో సంఘటన స్థలానికి చేరుకొని రైళ్ల రాకపోకల పునరుర్ధరణ కోసం యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతు పనులు చేపట్టారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కాజీపేట, బలార్షా రామగిరి ప్యాసింజర్, హైదరాబాద్ - న్యూఢిల్లీ రైళ్లు రద్దు చేయగా, కాజీపేట అగ్ని ప్యాసింజర్, బలార్షా - భద్రాచలం రైలు కూడా రద్దయింది. ఇదిలా ఉంటే దారి మళ్లించిన రైళ్లలో యశ్వంత్‌పూర్ గోరఖ్‌పూర్, సికింద్రాబాద్- గోరఖ్‌పూర్, బెంగళూర్ సిటి హజ్రత్‌నిజాముద్దీన్‌తోపాటు నిజామాబాద్ - ముత్తేడ్, ఆదిలాబాద్ - చింపల్‌కుట్టి మీదుగా దారి మళ్లించిన రైళ్లలో సికింద్రాబాద్ - ధనాపూర్, చెన్నై - బికనీర్, కేరళ ఎక్స్‌ప్రెస్, మరిన్ని ట్రైన్‌లు ఉన్నాయి. రైళ్ల రాకపోకలు ఇతర ఇబ్బందులపై సమాచారం కోసం రైల్వే శాఖ సికింద్రాబాద్, ఖమ్మం, కాజీపేట, వరంగల్, సిర్పూర్ - కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లలో రైల్వే హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాగా రైళ్ల రద్దువల్ల వివిధ రైళ్లలో ప్రయాణాలకోసం వేచి చూసిన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చలితీవ్రతతో వారి ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి.

చిత్రం..విరిగిన రైలు పట్టా, నుజ్జయిన బోగీలు