జాతీయ వార్తలు

బస్తర్‌కు పోలీసు చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 6: దండకారణ్యం, ఏఓబి మావోయిస్టుల విప్లవ కారిడార్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీల బతుకు ఛిద్రవౌతోంది. వారు అటు నక్సల్స్, ఇటు పోలీసుల బుల్లెట్ల పోరులో నలిగిపోతున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. దట్టమైన అడవులు, కీకారణ్యంలో కాలిబాటలు, వాగులు, కొండలే వారి నేస్తాలు. రోగం వచ్చినా, రొప్పు వచ్చినా దేవుడే దిక్కు. సీజనల్ వ్యాధుల పోరులో అలసి ప్రాణాలు వదులుతున్నారు గిరిపుత్రులు. అటువంటి బస్తర్ దండకారణ్యానికి పోలీసులు చికిత్స ప్రారంభించారు. సేవా గుణంతో ఆదివాసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఆపరేషన్ గ్రీన్ హంట్‌లో సిఆర్‌పిఎఫ్ పబ్లిక్ రిలేషన్ వింగ్ నిత్యం ఆదివాసీ గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద గిరిజనులకు నిత్యావసరాలు, బట్టలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా బస్తర్ ఐజి ఆదేశాలతో దర్బా బ్లాక్‌లో ఎఎస్పీ విజయ్‌పాండే మారుమూల గిరిజన పల్లెలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న సోడి జ్యోతి అనే 4 ఏళ్ల చిన్నారిని దర్బా ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నారు. ఈ నెల 2న చిన్నారిని చేర్పించి వైద్యం ఖర్చులు మొత్తం పోలీసులే భరిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మెదడు వాపు వ్యాధి 100 మంది చిన్నారులను కబళించింది. దోమకాటే ప్రధాన కారణం అని తెలుసుకున్న సిఆర్పీఎఫ్ జవాన్లు అధికారులు ఎవరూ వెళ్లలేని కొండ ప్రాంతాల్లో గిరిజన గ్రామాల్లో ఫాగింగ్ చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీల మనస్సు దోచుకునేందుకు భద్రతా బలగాలు నడుంబిగించాయి. ఇటు తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బేస్ క్యాంపుల్లోని సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా సమీప గిరిజన గ్రామాల్లో మంచినీటి బోర్లు వేయించడం, విద్యుత్ లైన్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, పేద గిరిజనులకు నిత్యావసరాలు, బట్టలు పంపిణీ చేస్తున్నారు. గిరిజనులతో మమేకమై వారికి అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గిరిజన యువత మావోయిస్టు పార్టీ బాట పట్టకుండా నిరోధించవచ్చని ఈ ద్విముఖ వ్యూహాన్ని భద్రతా బలగాలు అనుసరిస్తున్నాయి. ఏది ఏమైనా నక్సల్స్ ప్రభావిత ఆదివాసీ గ్రామాలకు సేవలు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి.

చిత్రం..సోడి జ్యోతిని దర్బా వైద్యశాలలో చేర్పించిన పోలీసులు