జాతీయ వార్తలు

న్యాయ నిర్ణయ ప్రక్రియకు విఘాతం కలగకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: న్యాయపరమైన సమతుల్యతను కాపాడడం, అలాగే న్యాయ నిర్ణయ ప్రక్రియకు విఘాతం కలిగించకుండా ఉండడం న్యాయమూర్తి విధి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అల్లర్లకు సంబంధించిన ఒక కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశిస్తూ హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు కోర్టు అధికార పరిధిని ఉపయోగించుకుని ఎఫ్‌ఐఆర్‌ను లేదా దర్యాప్తును కొట్టివేయాలని కోరుతూ అనవసరంగా పిటిషన్లు దాఖలు చేసే దురుద్దేశపూరిత లిటిగెంట్లను కోర్టులు దూరంగా పెట్టాలని కూడా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. నేరశిక్షాస్మృతి (సిఆర్‌పిసి)లోని 482 సెక్షన్ కింద తనకున్న అధికారాలను ఉపయోగించుకుని దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్టు చేయకుండా దర్యాప్తు ఏజన్సీని అడ్డుకునే అధికారం హైకోర్టుకు ఉందా అని ప్రశ్నిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి అమితావ రాయ్ కూడా ఉండే ఈ బెంచ్ విచారణకు స్వీకరించింది. రాజ్యాంగంలోని 226 అధికరణం కింద లేదా నేరశిక్షాస్మృతిలోని 482 సెక్షన్ కింద పిటిషన్లను విచారణకు స్వీకరించేటప్పుడు హైకోర్టు జ్యుడీషియల్ సంయమనాన్ని పాటించి ఉండాల్సిందని బెంచ్ అభిప్రాయపడింది. న్యాయపరమైన సమతుల్యతను పాటించడంతో పాటు న్యాయ నిర్ణయ ప్రక్రియకు విఘాతం కలిగించే ఆదేశం గురించి ఆలోచించడం న్యాయమూర్తి విధి అని బెంచ్ స్పష్టం చేసింది.