జాతీయ వార్తలు

‘పన్నుకు పన్ను..’ సిద్ధాంతం శిక్షలకు కొలమానం కారాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: సభ్య సమాజంలో దోషులకు శిక్ష విధించేటప్పుడు ‘పన్నుకు పన్ను.. కన్నుకు కన్ను’ అనే సిద్ధాంతం కొలమానంగా ఉండకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. రెండు హత్య కేసుల్లో ఇప్పటికే 16 ఏళ్లకు పైబడి శిక్ష అనుభవించిన ఢిల్లీకి చెందిన మాజీ విద్యార్థిని విడుదల చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక హత్య కేసులో ఈ విద్యార్థికి 30 ఏళ్ల జైలుశిక్ష విధించిన ట్రయల్ కోర్టు మరో హత్య కేసులో అతను జీవించినంతకాలం జైల్లోనే కొనసాగాలని స్పష్టం చేసింది. అంతేకాదు జీవించి ఉన్నంతకాలం జైల్లోనే ఉండాలనే శిక్షాకాలం ఇప్పుడు 42 ఏళ్లున్న దోషికి మొదటి కేసులో విధించిన 30 ఏళ్ల జైలుశిక్షాకాలం పూర్తయినప్పటినుంచి మొదలవుతుందని కూడా కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. నేరానికి తగిన శిక్ష ఉండాలనే సిద్ధాంతం గురించి న్యాయమూర్తులు జిఎస్ సిస్టాని, సంగీతా ధింగ్రాలతో కూడిన బెంచ్ ప్రస్తావిస్తూ భారతీయ న్యాయశాస్త్రంలో శిక్షలు విధించే విధానానికి సంబంధించినంతవరకు దీన్ని ఎంతో ఆచితూచి వర్తింపజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందువల్ల ‘పన్నుకు పన్ను, కన్నుకు కన్ను’ అనే సిద్ధాంతం కొలమానంగా ఉండరాదని, అంతేకాకుండా జీవిత ఖైదులను విధించే విషయంలో తొందపాటుతో వ్యవహరించడం అనేది ఏమాత్రం ఉండకూడదనేది తమ అభిప్రాయమని న్యాయమూర్తులు అన్నారు. జితేందర్ అనే ఈ వ్యక్తికి శిక్షలు విధించే విషయంలో న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన రోజే శిక్షలను ప్రకటించడాన్ని బట్టి చూస్తే ముందే ఒక నిర్ణయానికి వచ్చి తొందరపాటుగా వ్యవహరించిందనిపిస్తోందని బెంచ్ అభిప్రాయపడింది. నిందితుడు ఇప్పటికే 16 ఏళ్ల 10 నెలల జైలుశిక్షను పూర్తి చేసినందున అతనిపై మరే కేసులు లేని పక్షంలో అతడ్ని విడుదల చేయాలని బెంచ్ ఆదేశించింది.