జాతీయ వార్తలు

ప్రజాపద్దుల కమిటీ ముందుకు ప్రధాని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: పెద్ద నోట్ల రద్దుకు దారితీసిన పరిస్థితుల గురించి విచారించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజాపద్దుల కమిటీ ముందుకు రప్పించాలని ఆలోచిస్తున్నట్లు ఆ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కురుప్పస్సేరి వర్కేయి థామస్ చెప్పారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఈనెల 20న విచారించిన అనంతరం నరేంద్ర మోదీని కమిటీ ముందుకు రప్పించే అవకాశాలున్నాయని ఆయన చెప్పటం వివాదాస్పదంగా మారింది.
థామస్ సోమవారం కొందరు విలేఖరులతో మాట్లాడుతూ కమిటీలోని మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే నరేంద్ర మోదీని కమిటీ ముందుకు పిలిచి పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన పలు అంశాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దును గట్టిగా వ్యతిరేకించటంతో పాటు ఈ నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక పట్టుపడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు థామస్ కూడా ఇదే పద్ధతిలో ప్రజా పద్దుల కమిటీ ముందుకు నరేంద్ర మోదీని రప్పించాలని ఆలోచిస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దుకు దారి తీసిన పరిస్థితుల గురించి వివరించేందుకు ఈనెల 20న తమ కమిటీ ముందు హాజరు కావాలని రిజర్వు బ్యాంకు అధ్యక్షుడు ఊర్జిత్ పటేల్‌ను థామస్ ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దుకు దారి తీసిన పరిస్థితులు, ఇంత వరకు ఎన్ని లక్షల కోట్లు బ్యాంకుల్లోకి వచ్చాయి? నల్ల ధనం విలువ ఎంత? దేశంలో ఎప్పటిలోగా ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుంది? ప్రజలకు అవసరమైనంత నగదు బ్యాంకులు, ఏటిఎంలలో ఎప్పటి నుండి లభిస్తుంది? పెద్ద నోట్లను రద్దు చేయాలనే నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారు? ఈ నిర్ణయం రిజర్వు బ్యాంకుదా? లేక నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వానిదా? అనే ప్రశ్నలకు ఉర్జిత్ పటేల్ సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు వలన ఏ మేరకు నల్ల ధనం వెలుగులోకి వచ్చింది? పెద్ద నోట్ల రద్దు ఆశించిన ఫలితాలను ఇచ్చిందా? లేదా? ఇస్తే ఏ మేరకు ఫలితం లభించింది? రద్దు విజయవంతం కాకపోతే దీనికి గల కారణాలేమిటి? అన్నవి ప్రజాపద్దుల కమిటీ ప్రశ్నలు.
ఈ ప్రశ్నలపై ఊర్జిత్ పటేల్‌ను విచారించిన అనంతరం నరేంద్ర మోదీని కమిటీ ముందుకు రప్పించే అంశంపై కమిటీ దృష్టి పెడుతుందని అంటున్నారు. తమ ముందుకు ఎవరినైనా రప్పించే అధికారం ప్రజాపద్దుల కమిటీకి ఉన్నది. ఈ అధికారం ఆధారంగానే నరేంద్ర మోదీని రప్పించాలని థామస్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే థామస్ కమిటీ నిజంగానే నరేంద్ర మోదీని కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించగలుగుతుందా? అనేది ప్రశ్న. థామస్ అధ్యక్షతన పని చేస్తున్న ప్రజా పద్దుల కమిటీలో లోక్‌సభకు చెందిన 15 మంది, రాజ్యసభకు చెందిన ఏడుగురు సభ్యులుగా ఉన్నారు. పోలీసులు ఇటీవలే అరెస్టు చేసిన లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ, బిజెడి సీనియర్ నాయకుడు బర్తుృహరి మహతాబ్, ఎస్‌పి సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు నరేశ్ అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సత్యవ్రత చతుర్వేది తదితర ప్రతిపక్షం నాయకులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలోని బిజెపి, దాని మిత్రపక్షాల సభ్యులను దృష్టిలో పెట్టుకుంటే ప్రధాని మోదీని ప్రజా పద్దుల కమిటీ ముందుకు తీసుకురావలనుకుంటున్న థామస్ కలలు నిజం కావటం ఏమాత్రం సులభం కాదు. థామస్ నాయకత్వంలోని ప్రజా పద్దుల కమిటీ జనవరి 20న సమావేశం అవుతోంది. రిజర్వు బ్యాంక్ అధ్యక్షుడు ఊర్జిత్ పటేల్ ఈ కమిటీ సమావేశంలో ఏం మాట్లాడుతారు? పెద్ద నోట్ల రద్దును ఎలా సమర్థిస్తారనేది చూసిన తరువాత మోదీని కమిటీ ముందుకు రప్పించే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు వీలు కలుగుతుందని అంటున్నారు.

చిత్రాలు..ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ