జాతీయ వార్తలు

గంగాసాగర్ జాతరలో తొక్కిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచుబేరియా, జనవరి 15: పశ్చిమ బెంగాల్‌లోని గంగా సాగర్ జాతరలో అదివారం తొక్కిసలాట జరిగి ఒక మహిళతో సహా 8 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. మకర సంక్రాంతి సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు కోల్‌కతా చేరుకోవడానికి పడవలు ఎక్కేందుకు 24 పరగణాల జిల్లా కొచుబేరియా జెట్టీ వద్ద ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. చనిపోయిన వారంతా మధ్య వయస్కులని, వారిని ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. తొక్కిసలాట సమయంలో ఎవరైనా బురీగంగా నదిలో పడిపోయారేమో తెలుసుకోవడానికి నదిలో గాలింపు కొనసాగుతోంది. గంగాసాగర్ వద్ద శని, ఆదివారాల్లో దాదాపు 16 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని పశ్చిమ బెంగాల్ ప్రజారోగ్య ఇంజనీరింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ చెప్పారు.

చిత్రం..గంగాసాగర్ జాతర ముగించుకుని తిరిగివెళుతున్న భక్తులు