జాతీయ వార్తలు

ఈ ఏడాది నుంచే ఐఐఎస్‌ఇఆర్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: భారత శాస్త్ర, విద్యా పరిశోధనా సంస్థ (ఐఐఎస్‌ఇఆర్)ను తిరుపతిలో ప్రారంభించటానికి కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. రాజమండ్రిలో వ్యవసాయ కాలేజీకి శాశ్వత భవనాల నిర్మాణం కోసం కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థకు చెందిన 21.93 ఎకరాల భూమిని బదిలీ చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న భారత శాస్త్ర, విద్యా పరిశోధనా సంస్థ కార్యకలాపాలు 2015-16 సంవత్సరం నుండి ప్రారంభమయ్యేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలోని శ్రీరామా ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సంస్థను తాత్కాలికంగా నిర్వహిస్తారు. 2015 నుండి 2018 వరకు మూడు సంవత్సరాల పాటు తాత్కాలిక క్యాంపస్‌లో ఈ సంస్థ పనిచేసేందుకు 137.30 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ సంస్థను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంస్థకు శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలంలోని శ్రీనివాసపురం, పంగూరు, చిందెపల్లి గ్రామాల్లో 244 ఏకరాల భూమిని కేటాయించటం తెలిసిందే.
ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కొత్త వ్యవసాయ కళాశాలను 2008-09 విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కాలేజీ స్థానిక ఆర్ట్స్, సైన్స్ కాలేజీలో తాత్కాలిక సదుపాయాలతో పనిచేస్తోంది. ఈ కాలేజీకి శాశ్వత భవనాలను ఏర్పాటుచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాజమండ్రిలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థకు చెందిన 21.93 ఎకరాల భూమిని ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి యాభై సంవత్సరాల సుదీర్ఘ లీజుపై బదిలీ చేయాలని నిర్ణయించింది. రాజమండ్రిలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయటం వలన గోదావరి డెల్టాలో వ్యవసాయ పరిశోధన, వ్యవసాయ విద్యా వ్యాప్తికి ఎంతో తోడ్పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.