జాతీయ వార్తలు

అనంతపురానికి స్వచ్ఛ విద్యాలయ అవార్డు నేడు జిల్లా కలెక్టర్‌కు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్భారత్ అమలులో ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోంది. స్వచ్ఛ విద్యాలయ జాతీయ అవార్డుకు రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఎంపిక అయ్యింది. మూడు నెలల కాలంలో దాదాపు 3880పైగా స్కూళ్ళలో మరుగుదొడ్ల నిర్మాణం, వౌలిక సదుపాయలను కల్పించినందుకు గాను ఈ అవార్డుకు అనంతపురం జిల్లా ఎంపిక అయింది. గురువారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఓ కార్యక్రమంలో ఆ కలెక్టర్ కోలాశశిధర్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకొనున్నారు. దేశంలోని అన్ని స్కూళ్లలో వౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాధాన్యతనిస్తోంది.