జాతీయ వార్తలు

రాష్టప్రతి పొరబడరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనితాల్, ఏప్రిల్ 20: ఉత్తరాఖండ్ అసెంబ్లీని సస్పెండ్ చేయడానికి రాష్టప్రతి తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్ష పరిధికి లోబడినదేనని, ఎందుకంటే ఆయన కూడా తప్పు చేయవచ్చని ఉత్తరాఖండ్ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్‌లో రాజ్యాంగంలోని 356 అధికరణాన్ని విధించాలన్న నిర్ణయాన్ని రాష్టప్రతి తన రాజకీయ జ్ఞానాన్ని ఉపయోగించి తీసుకున్నారన్న ఎన్డీఏ ప్రభుత్వ వాదనను ప్రధాన న్యాయమూర్తి కెఎం జోసెఫ్, న్యాయమూర్తి వికె బిస్త్‌లతో కూడిన బెంచ్ ప్రస్తావిస్తూ, ‘రాష్టప్రతి కాని, జడ్జీలు కాని.. ఎవరైనా తప్పు చేయవచ్చు’ అని వ్యాఖ్యానించింది. రాష్టప్రతి తన ముందుంచిన సమాచారాన్ని అర్థం చేసుకున్న తీరు కోర్టు అర్థం చేసుకున్న దానికన్నా భిన్నంగా ఉండ వచ్చునని కేంద్రం వాదించిన తర్వాత బెంచ్ ఈ వ్యాఖ్య చేసింది. రాష్ట్రంలో పరిస్థితికి సంబంధించి రాష్టప్రతికి గవర్నర్ పంపిన నివేదికను బట్టి ‘మార్చి 28న సభలో బలపరీక్ష దిశగా అన్ని విషయాలు ముందుకు సాగుతున్నట్లుగా మాకు అర్థమయింది’ అని బెంచ్ వ్యాఖ్యానించిన తర్వాత ప్రభుత్వం ఈ వాదన చేసింది. 35మంది ఎమ్మెల్యేలు డివిజన్ కోరినట్లు గవర్నర్ తన నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని కూడా వ్యాఖ్యానించింది. తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు డివిజన్‌ను కోరినట్లు కూడా గవర్నర్ నివేదికలో ఎక్కడా లేదని బెంచ్ తెలిపింది. రాష్టప్రతి పాలన విధించాల్సిన అవసరం ఉందనే భయాన్ని గవర్నర్ మదిలో కల్పించే మెటీరియల్ ఏదీకూడా నివేదికలో లేదని స్పష్టం చేసింది. మార్చి 19న గవర్నర్ రాష్టప్రతికి పంపిన నివేదికలో 35 మంది ఎమ్మెల్యేలు డివిజన్‌ను కోరినట్లు ఎక్కడా పేర్కొనలేదని బెంచ్ వ్యాఖ్యానించగా, ఆ రోజుకు గవర్నర్ వద్ద అన్ని వివరాలు లేవని దీనికి సమాధానంగా కేంద్రం చెప్పింది.