జాతీయ వార్తలు

ఎవర్నీ వదలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: పప్పు ధాన్యాల ధరలను జాగ్రత్తగా గమనిస్తున్నామని, పప్పు ధాన్యాలను అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. పప్పు్ధన్యాల ధరలు గత ఏడాది ఉండిన కిలో 200 రూపాయల స్థాయినుంచి దిగివచ్చినప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాల్లో వాటి ధరలు ఇప్పటికీ 83-177 రూపాయల మధ్య ఉంది. రెండేళ్లుగా ఏర్పడిన వర్షాభావం పరిస్థితుల కారణంగా దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో పప్పు్ధన్యాల ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ‘పప్పు ధాన్యాల ధరలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంది. అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది’ అని బుధవారం ఇక్కడ కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ విలేఖరులకు చెప్పారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం బుధవారం రిటైల్ మార్కెట్లలో మినపప్పు ధర కిలో రూ.177, కందిపప్పు 163, పెసర పప్పు రూ 122, మసూర్ పప్పు రూ. 98, సెనగ పప్పు రూ. 83 రూపాయలకు లభిస్తున్నాయి. గత నెలతో పోలిస్తే వీటి ధరలు కిలోకు 3 నుంచి 8 రూపాయల దాకా పెరిగాయి. దేశంలో పప్పు్ధన్యాల ధరలు పెరక్కుండా చూడడంతో పాటుగా సరఫరాలు పెరిగేలా చూడడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంది. ఈ ఏడాది కూడా పెద్దఎత్తున పప్పు్ధన్యాలను దిగుమతి చేసుకోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.