జాతీయ వార్తలు

కంబళపై నిషేధం ఎత్తేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళూరు, జనవరి 27: కర్నాటకలో కంబళ పేరుతో నిర్వహించే దున్నల పోటీలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోస్తా జిల్లాలో నినాదాలు మిన్నంటాయి. వేలాది మంది విద్యార్థులు, చలనచిత్ర ప్రముఖులు, పలువురు ప్రజాప్రతినిధులు శుక్రవారం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.
మంగళూరు నగర నడిబొడ్డున భారీ మానవ హారంగా నిలిచారు. కంబళపై నిషేధం ఎత్తివేయాలని నిరసన కారులు డిమాండ్ చేశారు. తమిళనాట జల్లికట్టును అనుమతించిన నేపథ్యంలో కన్నడిగుల సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న కంబళపై ఆంక్షలు ఎత్తివేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పెటా చేసిన ఆరోపణలను వారు తప్పుపట్టారు. కోస్తా జిల్లాలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి తమ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కాలరాయం దారణమని వారన్నారు.‘కంబళపై పెటా చేసిన ఆరోపణలు దారుణం. తుళు ప్రాం తంలో పూర్వ నుంచి ఈ క్రీడ జరుగుతోంది. జల్లికట్టుకు, కంబళకు తేడా తెలియని పెటా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది’అని దక్షిణ కన్నడ ఎంపీ నళిన్ కుమార్ కతీల్ విమర్శించారు. కంబళలో జంతువుల పట్ల ఎలాంటి క్రూరత్వం ప్రదర్శించడం లేదన్నది పెటా తెసుకుకోవాలని ఆయన అన్నారు. నిషేధం ఎత్తేసేవరకూ పోరాటం ఆగదని, నిరసన కారులకు తమ మద్దతు కొనసాగుతుందని ఎంపీ ప్రకటించారు.