జాతీయ వార్తలు

కుటుంబ సభ్యులకు అందలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 15: దివంగత అన్నాడి ఎంకె అధినేత్రి జయలలిత పార్టీ నుంచి బహిష్కరించిన ఇద్దరు కుటుంబ సభ్యులను ప్రధాన కార్యదర్శి వికె శశికళ మళ్లీ అందలమెక్కించారు.
ఆమె సన్నిహిత బంధువులైన టిటివి దినకరన్, ఎస్ వెంకటేశ్‌లను తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ‘దినకరన్, వెంకటేశ్‌లు తాము చేసిన చర్యలకు చింతిస్తున్నట్లుగా వ్యక్తిగతంగా, లికితపూర్వకంగా తెలియజేసినందున వారిని తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నాం’’ అని అందులో పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో శిక్ష పడిన వెంటనే ఆమె వేగంగా ఎత్తుగడలు మార్చారు. గతంలో పార్టీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన దినకరన్‌ను పార్టీ ఉప ప్రధానకార్యదర్శిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలంతా ఆయనకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దినకరన్, వెంకటేశ్‌లతో పాటు శశికళ, ఆమె భర్త నటరాజన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 2011లో జయలలిత బహిష్కరించారు. అయితే ఆ తరువాత శశికళ తన కుటుంబ సభ్యులతో సంబంధం లేదంటూ జయలలితకు లేఖ రాయటంతో ఆమెపై మాత్రం క్రమశిక్షణా చర్యలను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు దినకరన్, వెంకటేశ్‌లను శశికళ తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. మంగళవారం గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఇచ్చేందుకు శాసనసభాపక్ష నేత పళనిస్వామితో పాటు వెళ్లిన 11మంది నాయకుల బృందంలో దినకరన్ కూడా ఉన్నారు.