జాతీయ వార్తలు

రెండున్నర కోట్ల నగలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళకు సుమారు 2.51 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు సుప్రీం కోర్టు తన తీర్పులో వెలువరించింది. వీటితో పాటు, 15.9లక్షల రూపాయల విలువైన చేతి గడియారాలు ఉన్నాయని పేర్కొంది. జయలలిత మరణానంతరం తీర్పు రావటంతో ఆమెపై అన్ని ప్రొసీడింగ్‌లను నిలుపుదల చేస్తూ శశికళతో పాటు మరో ఇద్దరు నిందితుల శిక్షను ఖరారు చేసిన తరువాత ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ధ్రువీకరించింది. 570పేజీల సదరు తీర్పులో ఏ1 నిందితురాలు(జయలలిత) దగ్గర 1991-96 మధ్య కాలంలో 1.30 కోట్ల రూపాయల విలువైన వాహనాలు( ఓ మారుతి కారు, కాంటెస్సా, వాన్లు, జీపులు), 400 కిలోల వెండి ఉన్నట్లు ట్రయల్ కోర్టు పేర్కొంది. వీటితో పాటు జయలలిత ఇతర నిందితుల దగ్గర 92.4 లక్షల రూపాయల విలువైన చీరలు, రెండు లక్షల రూపాయల విలువైన చెప్పులు ఉన్నట్లు ప్రాసిక్యూషన్ చేసిన అభియోగాన్ని ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో రూ.97.47లక్షలు మరో 3.42కోట్ల రూపాయల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు తీర్పులో పేర్కొంది. నిందితులు పలు కంపెనీల్లోకి డబ్బులు తరలించినట్లు తీర్పులో వెల్లడించారు.

చిత్రం..సుప్రీం కోర్టు తన తీర్పులో వెలువరించిన జయ విలువైన బంగారు ఆభరణాలు