జాతీయ వార్తలు

పర్యావరణాన్ని పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: పర్యావరణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుకు కారణం గురించి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా అంతా కలిసి స్వచ్ఛమైన పర్యావరణం కోసం కృషి చేయాలని ఆయన ఉద్బోధించారు. పర్యావరణాన్ని పరిరక్షించవలసిన అవసరంపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన 16 బోగీలతో కూడిన సైన్స్ ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం ఇక్కడ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పు అనేది పెద్ద సమస్యని, దీని పరిష్కారానికి అంతా కలిసి యోచించి సమష్టిగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. రైల్వే, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా చేపట్టిన ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్ ఈశాన్య రాష్ట్ర నగరమైన అగర్తలా సహా దేశవ్యాప్తంగా 34 స్టేషన్ల మీదుగా సెప్టెంబర్ 8వ తేది వరకు ప్రయాణిస్తుంది. వాతావరణ మార్పు పై దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. వాతావరణ మార్పు కు భారత్ కారణం కానప్పటికీ, దానికి పరిష్కారం కనుగొనడంలో ముఖ్య భూమిక పోషించిందని, వాతావరణ మార్పు నిరోధానికి కుదిరిన పారిస్ ఒప్పందంలో మన దేశం పాత్రం ఎంతో కీలకమని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అనిల్ మాధవ్ దావే మాట్లాడుతూ సైన్స్ ఎక్స్‌ప్రెస్ వేలాది గ్రామాలకు వెళ్లవలసిన అవసరం ఉందన్నారు. 2007లో ప్రారంభమైన ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్ ఇప్పటి వరకు 1,42,000 వేల కిలోమీటర్లు ప్రయాణించిందని, 455 ప్రదేశాల్లో ఆగిందని వివరించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్శవర్ధన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.