జాతీయ వార్తలు

పళని విశ్వాస పరీక్షపై కోర్టుకెక్కిన డిఎంకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 20: తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగిన విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించాలని కోరుతూ ప్రధాన ప్రతిపక్షం డిఎంకె సోమవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిఎంకె లాయర్, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.షణ్ముగ సుందరమ్ ఈ పిటిషన్ వేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా పెద్దఎత్తున రభస చోటుచేసుకోవటం తెలిసిందే. డిఎంకె సభ్యులను సస్పెండ్ చేసి మరీ ఓటింగ్ జరపాల్సిన పరిస్థితులను ఆ పార్టీ కల్పించింది. దీంతో విశ్వాస పరీక్షను సవాలు చేస్తూ డిఎంకె పిటిషన్ వేసింది.