జాతీయ వార్తలు

గుజరాత్ అసెంబ్లీలో బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, ఫిబ్రవరి 23: రైతు ఆత్మహత్యలపై గుజరాత్ అసెంబ్లీ గురువారం అట్టుడికిపోయింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ముష్టిఘాతాలకు పాల్పడ్డారు. ఇరుపక్షాలు పరస్పరం దాడులకు దిగాయ. ఘర్షణల్లో ఓ మహిళా మంత్రితోపాటు మరో శాసన సభ్యుడు గాయపడ్డారు. గొడవకు కారణమైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభనుంచి సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు అయ్యేవరకూ వారిని సస్పెండ్ చేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ రమణ్‌లాల్ వోరా ప్రకటించారు. బిజెపి సభ్యులపై వారు దాడికి పాల్పడ్డారని ఆరోపణలపై పరేష్ ధానానీ, బల్దేవ్‌జీ ఠాకూర్‌పై ఈ చర్య తీసుకున్నట్టు స్పీకర్ తెలిపారు. మంత్రులు నిర్మల వధ్వానీ, వల్లభ్ కకాడియాలపై కాంగ్రెస్ సభ్యులు దాడికి ప్రయత్నించారని ఆయన చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆమ్రేలీలో రైతు ఆత్మహత్యల అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు ధాననీ లేవనెత్తారు. జునాగఢ్, ఆమ్రేలీ జిల్లాల్లో ఈ రెండేళ్లలో ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతు ఆత్మహత్యలు జరగలేదని వ్యవసాయ మంత్రి ఛిమన్ సపారియా ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి సీటు వద్దకు దూసుకొచ్చారు. 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు హోమ్‌శాఖ గణాంకాలు చెబుతుంటే మంత్రి అవాస్తవాలు వెల్లడించారని ధాననీ విరుచుకుపడ్డారు. అదే సమయంలో కలోల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్దేవ్‌జీ ఠాకూర్ కూడా మంత్రి సీటు వద్దకు చేరుకుని ఆమె చేతిలో పేపర్లు తీసుకునే చించ బోయారు. దీంతో గందరగోళం ఏర్పడింది. సభ సద్దుమణగకపోవడంతో స్పీకర్ కాసేపు వాయిదా వేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాంథి అమృతీయ, ప్రఫుల్ పన్సారియాలు దాడికి దిగారంటూ కాంగ్రెస్ సభ్యులు గొడవకు దిగారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఘర్షణలకు తలపడ్డారు. మంత్రి నిర్మలా వధ్వానీ, కాంగ్రెస్ సభ్యుడు ఠాకూర్ గాయపడ్డారు. ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ప్రతిపక్ష నేత శంకర్‌సిన్హ వాఘేలా సమక్షంలోనే ఘర్షణ జరగడం గమనార్హం.