జాతీయ వార్తలు

రాష్టప్రతిని కలిసిన స్టాలిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ గురువారం రాత్రి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో ్ర నియమాలకు విరుద్ధంగా పళనిస్వామి విశ్వాస పరీక్ష జరిగిందని రాష్టప్రతికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని, ప్రధాన ప్రతిపక్షాన్ని బలవంతంగా శాసనసభనుంచి బయటకు పంపించి విశ్వాస పరీక్షను నిర్వహించటం గర్హనీయమని రాష్టప్రతికి వివరించారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరించారని అన్నారు. రాష్టప్రతి వెంటనే జోక్యం చేసుకుని తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18న అసెంబ్లీలో జరిగిన కార్యకలాపాలకు సంబంధించి ఎడిట్ చేయని వీడియో ఫుటేజి తనకు ఇవ్వాలని స్పీకర్ ధనపాల్‌ను స్టాలిన్ కోరారు. ఆ ఫుటేజీని తాను హైకోర్టుకు సమర్పించాల్సి ఉందని ఆయన స్పీకర్‌కు తెలియజేశారు.