జాతీయ వార్తలు

జయ కోరిక మేరకే సమాచారమిచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 23: అన్నాడి ఎంకె దివంగత అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమ ఆసుపత్రిలో చేరిన తరువాత ఆమె కోరిక మేరకే ఫోటోలు విడుదల చేయలేదని చెన్నై అపోలో ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. వైద్యం జరుగుతున్న సందర్భంలో ఫోటోలు తీసినప్పటికీ, జయ నిరాకరించటంతో ఫోటోలు విడిదల చేయలేదన్నారు. తనకు జరుగుతున్న వైద్య చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆమె కోరిక మేరకే విడుదల చేయటం జరిగిందని మద్రాస్ హైకోర్టుకు గురువారం సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో అపోలో యాజమాన్యం తెలియజేసింది. జయలలితకు జరిగిన వైద్య చికిత్సపైనా, ఆమె మృతిపైనా అనుమానం వ్యక్తం చేస్తూ పి ఎ జోసెఫ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు అపోలో తన అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ కమిటీని వేయాలని తన పిటిషన్‌లో జోసెఫ్ కోరారు. భారత వైద్య మండలికి సంబంధించి 2002లో రూపొందించిన నియమాల ప్రకారం రోగి ఆరోగ్యానికి సంబంధించి వారి అనుమతి లేకుండా విడుదల చేయరాదని తెలిపారు. అపోలో తరపున మోహన్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జె.రాధాకృష్ణన్ వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు.