జాతీయ వార్తలు

ఇపిఎఫ్ ఇంటి పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఇపిఎఫ్‌ఓ) నాలుగు కోట్లకు పైగా ఉండే తమ చందాదారులకోసం వచ్చే నెల ఒక హౌసింగ్ పథకాన్ని ప్రారంభించబోతోంది. సభ్యులు ఇళ్లు కొనుగోలు చేయడానికి చెల్లించాల్సిన డౌన్‌పేమెంట్‌తో పాటుగా నెలవారీ కంతులను కూడా తమ ఇపిఎఫ్ ఖాతాలనుంచే చెల్లించేందుకు వీలుగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. ‘ఇపిఎఫ్‌ఓ తమ చందాదారులకోసం ఒక హౌసింగ్ పథకాన్ని సిద్ధం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో పోలింగ్ మార్చి 8న ముగిసిన తర్వాత ఎప్పుడైనా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశముంది’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఉద్యోగులు తాము సర్వీసులో ఉన్న సమయంలో ఇల్లు కొనుగోలు చేసేందుకు ఇపిఎఫ్‌ఓ ఈ పథకం కింద ఒక సంధానకర్తగా వ్యవహరిస్తుందని కూడా ఆయన చెప్పారు.
ఈ పథకం కింద ఉద్యోగులు, వారి యజమాని కలిసి ఒక గ్రూపు హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని, ఆ సొసైటీ బ్యాంకులు, బిల్డర్లు లేదా ఇళ్లను విక్రయించే వారితో ఒప్పందం చేసుకోవలసి ఉంటుందని ఆ అధికారి చెప్పారు. ఈ సదుపాయం పొందేందుకు గ్రూపు హౌసింగ్ సొసైటీలో కనీసం 20 మంది సభ్యులుండాలని ఈ పథకంలో నిర్దేశించారు. అంతేకాదు, అందరికీ సొంత ఇంటి కలను సాకారం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం కేంద్రం, రాష్ట్రాలు ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస యోజనలాంటి పథకాలకింద లభించే ప్రయోజనాలను కూడా ఈ పథకంలో కలుపుకోవడానికి కూడా అనుమతిస్తారని ఆ అధికారి చెప్పారు. అంతేకాదు చందారుడి రుణం చెల్లింపు సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఇపిఎఫ్‌ఓయే ఒక సర్ట్ఫికెట్ ఇస్తుంది గనుక సంఘటిత రంగంలోని కార్మికులు రుణం చెల్లింపునకు సంబంధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం సులువు అవుతుంది.
అయితే ఒక వేళ ఏదయినా వివాదం తలెత్తితే న్యాయపోరాటంలో ఇపిఎఫ్‌ఓ కక్షిదారుగా ఉండబోదని, గ్రూప్ హౌసింగ్ సొసైటీయే బ్యాంకర్ లేదా బిల్డర్, ఇళ్లు విక్రయించిన వారితో తమ వివాదాన్ని పరిష్కరించుకోవలసి ఉంటుందని కూడా ఆ అధికారి తెలిపారు. అంతేకాదు ఒకవేళ ఏదయినా వివాదం తలెత్తితే గ్రూపు హౌసింగ్ సొసైటీ కార్యవర్గం చీఫ్ అభ్యర్థన మేరకు డౌన్‌పేమెంట్‌ను, కానీ రుణానికి సంబంధించిన నెలవారీ కంతులను కానీ నిలిపివేసే హక్కు ఇపిఎఫ్‌ఓకు ఉంటుందని కూడా ఆ అధికారి చెప్పారు.