జాతీయ వార్తలు

ఏకత్వమే మన బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూర్, ఫిబ్రవరి 24: భిన్నత్వంలో ఏకత్వమే భారతీయత ప్రత్యేకత అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.దీనే్న భారతీయ సాంస్కృతిక శక్తిగా అభివర్ణించారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఇక్కడ 112 అడుగుల పరమ శివుడి ‘ఆదియోగి’ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడిన మోదీ ప్రకృతిని పరిరక్షించుకుంటూ, పరిసరాలను సంరక్షించుకుంటూ దానికి అనుగుణంగానే మనిషి తన జీవనాన్ని, జీవితాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు.మహా శివరాత్రి రోజున పాటించే జాగరణ నిరంతర చైతన్యానికి, పరిసరాల పట్ల జాగరూకతకు సంకేతమన్నారు. ఈషాయోగ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ అనాదిగా భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్న యోగా ప్రాధాన్యతను వివరించారు. యోగా చేయడం వల్ల శరీరం, మనసు అనుసంధానమవుతాయన్నారు. మనసు, శరీరం, ఆలోచనల్లో వైరుధ్యాలు లేకుండా ఒక్కటిగా పనిచేయడానికి యోగా ఉపకరిస్తుందని తెలిపారు. అంటే..కుటుంబంలోనూ, సమాజంలోనూ, పశుపక్ష్యాదులతోనూ కలిసికట్టుగా జీవించగలిగే స్ఫూర్తిని యోగా కలిగిస్తుందని తెలిపారు. ‘నా నుంచీ మన’ అన్న భావన మధ్య జరిగే ప్రయాణమే యోగా’అని వివరించారు. శాంతియుత సహజీవన ఆవశ్యకతను వివరించిన ప్రధాని ‘సర్వాంతర్యామి అయిన పరమ శివుడే ఇందుకు నిదర్శనం’అని పేర్కొన్నారు. ‘శివుడి వాహనం నంది. గణపతి వాహనం మూషికం, కుమారస్వామి వాహనం నెమలి..శివుడి మెడను చుట్టుకుని ఉండే వాసుకి..ఇవన్నీ శాంతియుత సహజీవన సంకేతాలే..ప్రతి జీవజాతితోనూ కలిసి మెలసి జీవించాల్సిన స్ఫూర్తిని అందించేవే..’అని ఉద్ఘాటించారు.
ఈషా ఫౌండేషన్ సంస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ ‘ఆదియోగి’ విగ్రహాన్ని ఎనిమిది నెలల్లో నిర్మించామన్నారు.యోగాను పాటించడమే కాకుండా దాన్ని పరివ్యాప్తం చేస్తున్నందుకు మోదీని ప్రశంసించారు. కాగా, విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముందు మోదీ ‘మహా యోగ యజ్ఞాన్ని’ ప్రారంభించారు. అలాగే ఆదియోగ అనే పుస్తకాన్నీ ఆవిష్కరించారు. ధ్యాన లింగ, సూర్య కుంద్, నంది విగ్రహం వంటి ఎన్నింటినో మోదీ ఆసక్తిగా పరికించారు. సద్గురు జుగ్గీ వాసుదేవ్ స్వయంగా మోదీని వీటి గురించి వివరించారు.్ధ్యన లింగానికి ఆరతి ఇచ్చిన మోదీ పుష్పాలు చల్లి పూజ చేశారు. కొద్ది సేపు ధ్యాన లింగ మండపంలో కూర్చున్నారు. సంప్రదాయ సంగీతం, సాంస్కృతిక శ్లోకాలతో కూడిన యోగా నృత్య రూపకాన్ని తిలకించారు. కొద్ది సేపు వాసుదేవ్‌తో కలిసి యోగా కూడా చేశారు. ప్రధాని రాక సందర్భంగా ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంతకు ముందు మోదికి తమిళనాడు గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి పళనిస్వామి స్వాగతం పలికారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పాండిచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా పాల్గొన్నారు.

చిత్రం..ఆదియోగి విగ్రహావిష్కరణ సభలో జగ్గీ వాసుదేవ్‌ను ఆప్యాయంగా పలకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ