జాతీయ వార్తలు

ఇజ్రాయెల్‌తో భారత్ క్షిపణి ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: మధ్యంతర శ్రేణి క్షిపణి అభివృద్ధికి సంబంధించి ఇజ్రాయెల్‌తో భారత్ ఒప్పందం ఖరారైంది. 17వేల కోట్ల రూపాయల వ్యయంతో భూ ఉపరితలం నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన క్షిపణిని అభివృద్ధి చేస్తారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డిఆర్‌డిఓ), ఇజ్రాయెల్ విమాన నిర్మాణ సంస్థ(ఐఏఐ) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడతాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్న సందర్భంలో ఈ కీలక ఒప్పందానికి కేంద్ర ఆమోదం తెలిపింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 25 ఏళ్లయిన సందర్భంగా ఈ కీలక ఒప్పందం కుదిరింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలోనే మధ్యంతర శ్రేణి క్షిపణి అభివృద్ధి ఒప్పందానికి ఆమోదం తెలిపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.