జాతీయ వార్తలు

జెఎన్‌యు సంస్కృతికి ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల పట్ల హార్వర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, యేల్ అండ్ న్యూయార్క్ యూనివర్శిటీ తదితర అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన 400 మందికి పైగా విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు జెఎన్‌యు వైస్ చాన్సలర్ జగదీష్ కుమార్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం జెఎన్‌యు సంస్కృతికి, అంతర్జాతీయ విద్యా సంస్థల సహకారం ప్రాతిపదికగా ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయ సాంస్కృతిక నేపథ్యానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉందని వారు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా ప్రమాణాలతో అంతర్జాతీయ ఖ్యాతిని పొంది ప్రపంచానికి ఎంతో మంది మేథావులను, పరిశోధకులను, నిపుణులను అందించిన జెఎన్‌యు క్యాంపస్‌లో గత కొంత కాలం నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్రమైన ఆవేదనను, దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని, కనుక ఈ వర్శిటీ భవిష్యత్తును కాపాడేందుకు సంబంధిత అధికారులు నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని కోరుతున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.