జాతీయ వార్తలు

రాహుల్ ఇంకా చిన్నోడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆజంగఢ్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 24: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా విరుచుకుపడ్డారు. ‘రాహుల్ ఇంకా పరిణతి సాధించలేదు. ఇందుకు మరికొంత సమయం పడుతుంది’ అని షీలా దీక్షిత్ అన్నారని పేర్కొంటూ, ‘అతను ఇంకా పరిణతి సాధించకుంటే, ఎందుకు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు? ఇదేమైనా రాజకీయ ప్రయోగశాలనా? లేక శిక్షణ మైదానమా?’ అని అమి త్ షా నిలదీశారు. శుక్రవారం ఇక్కడ బిజెపి నిర్వహించిన ఒక ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అనేక సమస్యలతో సతమతం అవుతోందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి ఉక్కు మనుషుల అవసరం ఉందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే ఉత్తరప్రదేశ్ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అమిత్ షా బిజెపి ఎన్నికల ప్రణాళికను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చాక పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు.