జాతీయ వార్తలు

తమిళనాట ‘జయ’హో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 24: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత 69వ జయంతిని ఆ రాష్ట్ర ప్రభు త్వం, ఎఐఎడిఎంకె పార్టీతో పాటు అసమ్మతి నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం వర్గీయులు శుక్రవారం పోటాపోటీగా నిర్వహించి, మరోసారి పరస్పరం మాటల తూటా లు పేల్చుకున్నారు. వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పేద ప్రజలకు సహాయాన్ని అందజేయడం ద్వారా వారు జయలలిత పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు. ఒమందురర్ ప్రభుత్వ ఎస్టేట్ వద్ద ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి మొక్కను నాటి ‘అమ్మ’కు ఘనంగా నివాళులర్పించడంతో పాటు గత ఏడాది వార్దా తుపాను వల్ల పెను విధ్వంసానికి గురైన ప్రాంతాల్లో 69 లక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 65.86 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని అడవులు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయ సముదాయాలు, ఉద్యాన వనాలతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటడం జరుగుతుందని తమిళనాడు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె హయాంలో తమిళనాడు ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర ఆర్థిక, మత్స్య శాఖ మంత్రి డి.జయకుమార్ ఆవిష్కరించారు. ఇదిలావుంటే, ‘అమ్మ’ జయం తి సందర్భంగా ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి వికె.శశికళ తమ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. బెంగళూరులోని జైలు నుంచి ఆమె రాసిన ఈ లేఖ ఎఐఎడిఎంకె అధికారిక పత్రిక ‘డాక్టర్ నమదు ఎంజిఆర్’లో ప్రచురితమైంది. పార్టీని కాపాడటంతో పాటు ప్రజల సంక్షేమం కోసం కృషి చేసేందుకు ప్రతి కార్యకర్తా ప్రతిన బూనాలని శశికళ ఆ లేఖలో పిలుపునిచ్చారు. పనిలో పనిగా ఆమె తనపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన అసమ్మతి నేత పన్నీర్ సెల్వంపై కూడా పరోక్షంగా నిప్పులు చెరిగారు. పార్టీని ఓడించాలని కొంత మంది శత్రువులు, ద్రోహులు భావించారని, అయితే ‘అమ్మ’ ఆత్మ తమను ముందుకు నడిపి ఎఐఎడిఎంకె ప్రభుత్వాన్ని అధికార పీఠంపై కూర్చోబెట్టిదని శశికళ ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా, జయలలిత జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆమెకు పుష్పాంజలి ఘటించి, ఉత్తర చెన్నైలోని తొండియార్‌పేటలో పేదలకు సాయాన్ని అందజేశారు. ‘అమ్మ’ ఆకాంక్షలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు ఎఐఎడిఎంకె పార్టీని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ ఆయ న ఈ సందర్భంగా శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.