జాతీయ వార్తలు

నగదు రహితమే తదుపరి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగ్‌చపర (అస్సాం), ఫిబ్రవరి 26: ఇప్పటికే బహిరంగ మల, మూత్ర విసర్జనతో పాటు మద్యం, పొగాకు, మాదకద్రవ్యాల నుంచి విముక్తి పొందిన విశిష్ట గ్రామంగా రికార్డు సృష్టించిన అస్సాంలోని రంగ్‌చపర ఇప్పుడు నగదు రహిత గ్రామంగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గోల్‌పర జిల్లాలోని ఈ గ్రామంలో గత 17 ఏళ్లలో ఎలాంటి చిన్న నేర సంఘటన జరగకపోవడం విశేషం. వచ్చే నెల నుంచి ప్లాస్టిక్‌ను వినియోగించని గ్రామంగా అవతరించాలని కూడా ఈ పల్లె ప్రతినబూనింది. అలాగే దేశంలోనే తొలి నగదు రహిత గ్రామంగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గ్రామ సర్పంచ్ రాబర్త్ జాన్ మోమిన్ చెప్పారు. ఎన్‌డిఎ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం కన్నా చాలా ఏళ్ల క్రితమే ఈ గ్రామంలో పరిశుభ్రత కోసం చర్యలు తీసుకున్నారు. 1999లోనే గ్రామస్థులు గ్రామ పరిశుభ్రతపై చర్చించడం మొదలు పెట్టారు. 2000లో తన నేతృత్వంలో పది మందితో ఒక కమిటీ ఇందుకోసం ఏర్పాటయిందని మోమిన్ చెప్పారు. గ్రామం ప్రశాంతంగా, ఐక్యంగా, పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యం ఉండాలనే నాలుగు తీర్మానాలను తమ కమిటీ చేసిందని ఆయన వివరించారు.