జాతీయ వార్తలు

వివాదంలో కార్గిల్ వీరుడి కూతురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: కార్గిల్ అమర జవాను కెప్టెన్ మన్‌దీప్‌సింగ్ కూతురు ఫేస్‌బుక్‌లో ఏబివిపికి వ్యతిరేకంగా మొదలు పెట్టిన ప్రచారం సామాజిక మాధ్యమంలో అత్యంత వివాదాస్పదంగా మారింది. మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్, బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడాలతో ట్విట్టర్ యుద్ధం మొదలైంది. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని అయిన గుర్మెహర్ కౌర్ (24) ఫేస్‌బుక్‌లో ‘నేను ఏబివిపికి భయపడను, నా తండ్రిని పాకిస్తాన్ చంపలేదు. యుద్ధం చంపింది’ అని వేర్వేరు ప్లకార్డులను ప్రదర్శించినప్పటి నుంచీ వివాదం మొదలైంది. ఆమె స్నేహితులు ఆమె పోస్ట్‌ను విపరీతంగా షేర్ చేయటంతో దేశమంతటా దీనిపై చర్చ మొదలైంది. వివిధ యూనివర్శిటీల నుంచి పెద్దఎత్తున విద్యార్థుల మద్దతు లభిస్తోంది. గుర్మెహర్ కౌర్ పోస్ట్‌పై స్పందించిన మాజీ క్రికెటర్ సెవాగ్ తాను ఓ ప్లకార్డును పట్టుకున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. ‘రెండు ట్రిపుల్ సెంచరీలు నేను చేయలేదు. నా బ్యాట్ చేసింది’ అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నాడు. నటుడు రణ్‌దీప్ హుడా సెవాగ్ పోస్ట్‌ను ప్రశంసిస్తూ గుర్మెహర్‌ను ఒక రాజకీయ పావుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై గుర్మెహర్ కూడా ఘాటుగానే స్పందించారు. ‘నాపై చిమ్ముతున్న విద్వేషాన్ని మీరు ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను పావుగా మారానా? దీనిపై ఆలోచించాలి. విద్యార్థులపై ఎలాంటి హింసాకాండను నేను సమర్థించను. ఇది తప్పా?’ అని ఆమె ట్వీట్ చేశారు. ‘మీరు నన్ను అమర జవాను కూతురు అని సంబోధించవద్దు. మీకు అదే సమస్య కావచ్చు. నేను ఎప్పుడూ అలా కోరుకోలేదు. నన్ను మీరు గుర్మెహర్ అని పిలిస్తే చాలు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో హింసకాండ చెలరేగిన మర్నాటి నుంచి ఈ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే.