జాతీయ వార్తలు

యూపీ ఐదోవిడతలో 57.36శాతం పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 27: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి సోమవారం జరిగిన ఐదో విడత ఎన్నికల్లో 57.36 శాతం పోలింగ్ నమోదయంది. సాయంత్రం 4 గంటలకు 1.81 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 57.36 శాతం పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 11 జిల్లాల పరిధిలోని 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు జరిగాయి. అమేధీ, ఫైజాబాద్‌లపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ప్రారంభమైన మొదటి రెండు గంటలూ నెమ్మదిగా సాగిన పోలింగ్ తరువాత పుంజుకుంది. ప్రజలు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. వివాదాస్పద మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి గట్టిపోటీనే ఎదుర్కొంటున్నారు. ఆయన ఓ అత్యాచారం కేసులో ఉన్నారు. రాష్టమ్రంతటా ఎస్‌పి గాలి విస్తోందని, అఖిలేశ్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ప్రజాపతి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత లోక్‌సభ నియోజకవర్గం అమేధీ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అమితాసింగ్, బిజెపి తరఫున గరీమా సింగ్ పోటీచేశారు. తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేత సంజయ్‌సింగ్ సతీమణి అమితా ధీమాగా ఉన్నారు. తన అభ్యర్థిత్వం పట్ల ఓటర్లు ఎంతో ఆదరణ చూపారని ఆమె అన్నారు. సంజయ్ మొదటి భార్య గరీమా కూడా తానే గెలుస్తానని చెబుతోంది. నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. బలరాంపూర్, గోండా, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, బహ్రైచ్, శరావస్థి, బస్తీ, సిద్ధార్థనగర్, సంత్ కబీర్ నగర్, అమేధీ, సుల్తాన్‌పూర్ జిల్లాలో ఐదో విడత పోలింగ్ జరిగింది. ఫైజాబాద్ సీటు కూడా ఈసారి ప్రతిష్ఠాత్మంగానే మారింది. ఈ జిల్లా పరిధిలోనే రామమందిరం ఉండడం, బిజెపి మేనిఫెస్టోలో మందిరం హామీ ఇవ్వడంతో హాట్ సీట్‌గా మారింది. అయోధ్య అసెంబ్లీ సీటు ఈ జిల్లా పరిధిలోనిదే. రామమందిరం నిర్మాణ ఉద్యమం రోజులనుంచి ఇక్కడ బిజెపినే గెలుస్తూ వస్తోంది. అయితే 2012 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అయోధ్యలో గెలవాలని బిజెపి వ్యూహాత్మంగా వ్యవహరించింది. ఇక అంబేద్కర్ నగర్ జిల్లాలోని అలాపూర్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ మృతి చెందడంతో అక్కడ మార్చి 9న ఎన్నిక జరుగుతుందని ఇసి ప్రకటించింది. 2012 ఎన్నికల్లో 52 నియోజకవర్గాల్లో (అలాపూర్ కలిపి) సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు దక్కించుకుంది. బిజెపి, కాంగ్రెస్‌లకు చెరో ఐదేసి సీట్లు, బిఎస్‌పికి మూడు, పీస్ పార్టీకి రెండు సీట్లు వచ్చాయి.

చిత్రం..ఫైజాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు