జాతీయ వార్తలు

మణిపూర్ బరిలో 54 మంది కోటీశ్వరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశలో 54 మంది కోటీశ్వరులు రంగంలో ఉన్నారు. మార్చి 4న ఇక్కడ మొదటి విడత పోలింగ్ జరుగుతోంది. ఎనిమిది మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయని ఎలక్షన్‌వాచ్ అంట్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడిఆర్) సంస్థ వెల్లడించింది. 167 మంది అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన తరువాత ఏడిఆర్ ఈ వివరాలు అందజేసింది. 17 రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టాయ. ఆరు జాతీయ పార్టీలు, ఐదు ప్రాంతీయ పార్టీలు, 6 గుర్తింపులేని పార్టీలు, 14 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. పార్టీల వారీగా కోటీశ్వరులైన అభ్యర్థుల జాబితా ఏడిఆర్ విడుదల చేసింది. కాంగ్రెస్ 31 మంది అభ్యర్థులను నిలబెట్టగా 21మంది కోటీశ్వరులు. 38 మంది బిజెపి అభ్యర్థుల్లో 21 మంది, నేషనల్ పీపుల్స్ పార్టీలో ఐదుగురు, నార్త్ ఈస్ట్ ఇండియా డెవలప్‌మెంట్ పార్టీలో ఇద్దరు కోటీశ్వరులున్నారు. తొలి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల యావరేజ్ ఆస్తి 1.04 కోట్లు. కాంగ్రెస్ అభ్యర్థుల విషయానికి వస్తే 1.73 కోట్లు, బిజెపి అభ్యర్థుల విషయానికి వస్తే 1.49 నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థులకు 1.06 కోట్లగా సరాసరి ఆస్తులున్నాయి. అత్యంత సంపన్న అభ్యర్థి నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి సేఫుహోకిప్. ఆయన ఆస్తులు 13 కోట్లు. బిజెపి అభ్యర్థి కొంతౌజాం కృష్ణకుమార్ 9 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఎనిమిది కోట్లతో కాంగ్రెస్ అభ్యర్తి కె బీరెన్‌సింగ్ మూడో స్థానంలో ఉన్నారు.