జాతీయ వార్తలు

గర్భస్రావానికి సుప్రీం నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఇరవై ఆరు వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలన్న ఓ మహిళ అభ్యర్థనను మంగళవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. తన గర్భంలో శిశువుకు జన్యుపరమైన లోపాలున్నట్లుగా వైద్యులు గుర్తించినందున గర్భస్రావానికి అనుమతించాలని 37 ఏళ్ల ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ మెడికల్ బోర్డు సలహాను కోరింది. తల్లి గర్భం కొనసాగించటంలో భౌతికంగా ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు లేవని, శిశువు బతికే అవకాశాలు కూడా ఉన్నాయని బోర్డు నివేదికను సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన జస్టిస్ ఎస్‌ఏ బోడో, జస్టిస్ ఎల్‌ఎన్ రావులతో కూడిన ధర్మాసనం సదరు మహిళ పిటిషన్‌ను కొట్టివేసింది. ‘మన చేతుల్లో ఒక జీవితం ఆధారపడి ఉంది. దాన్ని పరిరక్షించటం అందరి విధి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జన్యుపరమైన లోపంతో జన్మించే శిశువులు మేధోపరంగా మిగతావారితో సరితూగకపోయినా వారంతా మంచివాళ్లని ధర్మాసనం పేర్కొంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో గర్భస్రావానికి అనుమతించటం సాధ్యం కాదు’ అని స్పష్టం చేసింది. మహారాష్టక్రు చెందిన ఈ మహిళ ముంబైలోని కెమ్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకున్నారు. శిశువు ఎదుగుదల సరిగా లేకపోవటంతో ఆమె ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నివేదిక ఇచ్చారు. ఈ మేరకు గర్భస్రావానికి అనుమతించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 23న మెడికల్ బోర్డును సుప్రీం ధర్మాసనం ఏర్పాటు చేసి మహిళను పరీక్షించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక అనంతరం మంగళవారం తన తీర్పును వెలువరించింది. ఫిబ్రవరి 7న ఇదే రకమైన పిటిషన్‌పై గర్భస్రావానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.