జాతీయ వార్తలు

స్తంభించిన బ్యాంకింగ్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సమ్మెకు దిగటంతో అన్ని రకాల బ్యాంకింగ్ సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలతోపాటు చెక్ క్లియరెన్స్‌లు కూడా నిలిచిపోయాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఉన్నతస్థాయిలోని ఎగ్జిక్యూటివ్‌లతోపాటు సాధారణ ఉద్యోగుల స్థాయి వరకు అన్ని కేడర్‌లకు చెందిన ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. బ్యాడ్ లోన్లకు ఉన్నతాధికారులను బాధ్యులను చేయటాన్ని నిరసించటమే కాకుండా ‘తప్పనిసరి పరిస్థితిలోనే మేము సమ్మె బాట పట్టాల్సి వచ్చిందిన నోట్ల రద్దు కారణంగా మేము అదనంగా పనిచేసిన గంటలకు పరిహారం ఇవ్వటంపై కూడా బ్యాంకింగ్ మేనేజిమెంట్ కానీ, భారత బ్యాంకింగ్ అసోసియేషన్ కానీ పట్టించుకోవటం లేదు’ అని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం అన్నారు. బ్యాంకింగ్ రంగంలో కార్మిక సంస్కరణలు తీసుకురావాలన్న కేంద్రం ఆలోచనను కూడా ఉద్యోగులు తప్పుపట్టారు. అవుట్‌సోర్సింగ్‌ను ప్రవేశపెట్టాలన్న ఆలోచననూ తిరస్కరించారు. బ్యాంకుల్లోని అన్ని స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.