జాతీయ వార్తలు

ఆన్‌లైన్ రైల్ టిక్కెట్లకు ఆధార్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్ కార్డును తప్పని సరి చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. పెద్ద ఎత్తున టిక్కెట్లను బ్లాక్ చేయకుండా నిరోధించటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేమంత్రి సురేష్‌ప్రభు చెప్పారు. తప్పుడు ఆధారాలు చూపించి టిక్కెట్లను కొనుగోలు చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వారు చెప్తున్నారు. ముందుగా సీనియర్ సిటిజెన్లకు ఇచ్చే రాయితీ టిక్కెట్లకు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేయటం వల్ల మోసాలు బాగా తగ్గుముఖం పడతాయని వారు వ్యాఖ్యానించారు. 2017-18 సంవత్సరానికి సంబంధించి
రైల్వే బిజినెస్ ప్లాన్‌ను ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఆవిష్కరించారు. నగదు రహిత టిక్కెట్ లావాదేవీలు నిర్వహించేందుకు దేశ వ్యాప్తంగా ఆరు వేల పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు, వెయ్యి వరకు ఆటోమేటిక్ టిక్కెట్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ‘‘ ఐ ఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో ఒకసారి రిజిస్ట్రేషన్‌కు ఆధార్ నెంబర్ తప్పనిసరి. తప్పుడు గుర్తింపులను అరికట్టేందుకే ఈ చర్య తీసుకుంటున్నాం’’ అని అధికారులు తెలిపారు. దళారులు ఎక్కువ టిక్కెట్లను బ్లాక్‌చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ఈ మోసాలను అరికట్టేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు వారన్నారు. కొత్త బిజినెస్ ప్లాన్‌లో కొండ ప్రాంతాలను కలుపుతూ సరికొత్త టూరిస్టు రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
రవాణాకు డిస్కౌంట్లు
రైల్వే రవాణాను వినియోగించుకునే వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త డిస్కౌంట్ స్కీంలను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 1.5శాతం నుంచి 35శాతం మేర రాయితీలు రవాణా లోడింగ్‌ను అనుసరించి రాయితీ ఇవ్వనున్నారు. కనీసం మూడేళ్ల పాటు మూడు మిలియన్ టన్నుల రవాణా చేసేందుకు ఒప్పందం చేసుకునే వారికి ఈ రాయితీ వర్తిస్తుందని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు తెలిపారు. కొత్త వినియోగదారుడు మొదటి సంవత్సరం ఒక మిలియన్ టన్ను రవాణా చేసేందుకు అంగీకరించిన పక్షంలో రాయితీ లభిస్తుంది.