జాతీయ వార్తలు

‘కేరళ సిఎం తల నరికితే రూ.కోటి బహుమానం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉజ్జయినీ/న్యూఢిల్లీ, మార్చి 2: కేరళ ముఖ్యమంత్రి పినారాయి విజయన్ తల నరికితే కోటి రూపాయల బహుమతి ఇస్తానని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కుందన్ చంద్రావత్ ప్రకటించారు. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల్ని సిపిఎం కార్యకర్తలు చంపడానికి ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ రివార్డు ప్రకటించినట్టు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ విభాగం ఆర్‌ఎస్‌ఎస్ సహ్ ప్రచార్ ప్రముఖ్‌గా ఉన్న చంద్రావత్ తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల్ని కేరళ ముఖ్యమంత్రి చంపేస్తున్నారని అన్నారు.
చంద్రావత్ సంచలనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్ తెలిపింది. అసలు చంద్రవాత్ ఎవరో కూడా తమకు తెలియదని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడొకరు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రకటనల్ని తాము సహించమని, హింస దేనికీ పరిష్కారం కాదన్నది తమ సిద్ధాంతమని జాతీయ సహ్ ప్రచారక్ ప్రముఖ్ నందకుమార్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా చంద్రకాంత్ వ్యాఖ్యలపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్ అసలు రంగు ఏమిటో ఈ ప్రకటనతో అర్థమవుతోందని ఆయన అన్నారు. చంద్రకాంత్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, ఎన్‌డిఎ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు.