జాతీయ వార్తలు

ఎన్‌కౌంటర్‌లో దళకమాండర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 2: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా, ఒడిశా సరిహద్దుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళకమాండర్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు గ్రామస్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లా దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని కందనార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారని పోలీసు బలగాలకు సమాచారం అందింది. దీంతో ఒడిశా బలగాల సాయంతో సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించామని బస్తర్ ఎస్పీ రాజేంద్రనారాయణ దాస్ తెలిపారు. గంటసేపు మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం ఒక దళకమాండర్ మృతదేహాన్ని, 303 రైఫిల్, తూటాలు, డిటోనేటర్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. కాగా బీజాపూర్ జిల్లా భూపాల్‌పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్లగూడెం - దేప్లా గ్రామాల మధ్య భద్రతా బలగాలు లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతర పేలడంతో ఆ మార్గంలో వెళుతున్న ముగ్గురు గ్రామస్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.