జాతీయ వార్తలు

జలాంతర్గామి నుంచి క్షిపణి ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: భారత నౌకాదళం మొదటి సారి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కలవరి జలాంతర్గామి నుంచి నౌకా విచ్ఛేద క్షిపణిని గురువారం విజయవంతంగా ప్రయోగించింది. నీటి గర్భంలోంచి సముద్ర ఉపరితలంపై ఉన్న శత్రు నౌకలను ఛేదించే లక్ష్యంతో ఈ క్షిపణిని రూపిందించారు. అరేబియా మహా సముద్రంలో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైదని నౌకాదళ అధికారులు తెలియజేశారు. ప్రాజెక్టు-75 కింద రూపొందించిన ఆరు జలాంతర్గాముల్లో ఈ క్షిపణులను ఏర్పాటు చేస్తామని, ఏ క్షణంలోనైనా యుద్ధానికి సంసిద్ధంగా ఉండేలా క్షిపణి సంపత్తిని సిద్ధం చేస్తామన్నారు. ‘‘ ఈ క్షిపణి ప్రయోగం నౌకాదళ చరిత్రలో ఒక మైలురాయి వంటిది. ఇది కేవలం కలవరి జలాంతర్గామికే కాదు, స్కార్పేన్ తరగతి జలాంతర్గాములన్నిటినీ ఈ క్షిపణి బలోపేతం చేస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉపరితలంపై చేసే దాడుల విషయంలో భారత నౌకాదళం మరింత పరిపుష్టమైంది’8 అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.