జాతీయ వార్తలు

తీరంలో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: సముద్ర తీరంనుంచి పనె్నండు నాటికల్ మైల్స్ దూరం వరకు జరిగే వాణిజ్య లావాదేవీలను ఆయా రాష్ట్రాల పరిధిలోకి వచ్చేలా జిఎస్‌టి చట్టంలో సవరణలు చేశారు. ఆయా రాష్ట్రాల సముద్ర తీరంలో జరిగే లావాదేవీలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జిఎస్‌టి సమాఖ్య సమావేశాల్లో వాదించారు. శనివారం జరిగిన సమావేశంలో యనమల ప్రతిపాదనను ఆమోదించటంతోపాటు సిజిఎస్‌టి చట్టంలో మార్పులు చేశారు. తీర ప్రాంతాల్లో సహజవాయువు వెలికితీత, కొత్త ఓడరేవుల అభివృద్ధి తదితర కార్యక్రమాల మూలంగా ఇక మీదట తీర ప్రాంతం నుండి ఆదాయం బాగా పెరుతుందని, దీనివలన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని యనమల తెలిపారు.