జాతీయ వార్తలు

గోవాలో ప్రజాస్వామ్యం ఖూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: గోవాలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ మృదుల సిన్హా పాత్రపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాజ్యసభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గోవాలో ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా గవర్నర్ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనిపై చర్చ జరగాలని ఆ పార్టీ సభ్యులు డిమాండ్ చేయడంతో పాటు పోడియం వద్దకు రావడంతో సభను డిప్యూటీ చైర్మన్ కురియన్ 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సమర్పించిన అనతంరం జీరో అవర్ ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ దిగ్విజయ్ సింగ్ గోవా ప్రభుత్వ ఏర్పాటుపై రా జ్యాంగ నియమావళిని ఉల్లంఘించారని, గవర్నర్ పాత్రపై సభలో 267 రూల్ కింద చర్చ జరపాలని డిప్యూటీ చైర్మన్‌ను కోరారు. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ మృదుల సిన్హా కేంద్ర మంత్రులతో చర్చించినట్టు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించినా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంలో రాజ్యసభ ప్రతిపక్ష నా యకుడు గులామ్ నబీ ఆజాద్ జోక్యం చేసుకొని గతంలో 267 రూల్ కింద అరుణాచల్‌ప్రదేశ్ సంక్షోభం సమయంలో సభలో చర్చించినట్టు డిప్యూటీ చైర్మన్‌కు వివరించారు. ఈ అంశంపై చర్చించడం ఇప్పుడు సాధ్యంకాదని, జీరో అవర్ కొనసాగించాలని కాంగ్రెస్ సభ్యలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి రాజ్యసభ నియమావళి ప్రకారం మరో నోటీసు ఇస్తే చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అయితే ఈ సందర్భంలో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి గోవాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ అందోళనకు దిగారు.