జాతీయ వార్తలు

ఐదేళ్లూ ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, మార్చి 17: గోవాలో తమ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి పారికర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో గురువారం నాటి బలపరీక్షలో నెగ్గిన పారికర్ శుక్రవారం ఇక్కడ విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘మీ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉంటుందా? అని అడుగుతున్నారు. దీనికి నా సమాధానం ఒక్కటే. మా ప్రభుత్వం పూర్తికాలం అంటే ఐదేళ్లూ అధికారంలో ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు’అని పారికర్ చెప్పారు. మిత్రపక్షాలతో కలిసి కామన్ అజెండా అమలుకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. 61 ఏళ్ల ఐఐటియన్ పారికర్ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకున్నారు. బిజెపి 12, ముగ్గురు గోవా ఫార్వర్డ్ పార్టీ, ముగ్గురు మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఎన్‌సిపి సభ్యుడొకరు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. కాంగ్రెస్ సభ్యులు 16 మందిలో ఒకరు సమావేశానికి హాజరుకాలేదు. విశ్వజిత్ రాణే అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ్వత్వానికి రాజీనామా చేశారు. గోవా ముఖ్యమంత్రిగా పారికర్ నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందెప్పుడూ ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో లేదు. ఇటీవలే రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కాగా పారికర్ శుక్రవారం కేబినెట్ సహచరులతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈనెల 23న కొత్త అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ మృదులా సిన్హా ప్రసంగించనున్నారు.

చిత్రం.. కేబినెట్ సహచరులతో శుక్రవారం సచివాలయంలో భేటీ అయన గోవా ముఖ్యమంత్రి పారికర్